ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసుల్లో అంతరాయం

2024-10-08 07:46:46.0

సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్న యూజర్లు

ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీస్‌లో ఆటంకం ఏర్పడింది. అప్లికేషన్‌ లాగిన్‌తో పాటు సర్వర్‌ కనెక్షన్‌కు సంబంధించిన విషయాల్లో అవరోధం ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేస్తూ పలువురు యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. దేశీయంగా యూజర్లు ఈ ప్రాబ్లమ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం 64 శాతం మంది యూజర్లకు యాప్‌ లాగిన్‌ సమయంలో, 24 శాతం మంది కస్టమర్లకు సర్వర్‌ కనెక్షన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ‘Something went wrong’ అని వస్తున్నదని ఎక్స్‌ వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, జైపూర్‌, లఖ్‌నవూ, ముంబయి, అహ్మదాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నై.. నగరవాసులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కంపెనీ స్పందించలేదు. 

Instagram,goes down,Something went wrong,several Indian users