ఇలాగయితే ….!(కవిత)

2023-11-09 18:16:46.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/09/854055-ela-aithe.webp

ఏతమే

దప్పికకు ఏడుస్తే

వరిసేను

ఉరి పోసుకొనిచావదా

మబ్బులకు

నొప్పులు రాక పోతే

భూమాత పురుడు

ఎట్లా పోసుకుంటది

పంట సేను పరికిణీ

ఎట్లా కట్టుద్ది

హలము కన్నీళ్లు పెడితే

ఆకలికి భిక్షం ఎవరేస్తారు

బీడుబారిన

భూములనుచూసి

ఏడారి పరుపుపైన

రైతు

శాశ్వత నిద్రపోడా

– పొన్నాల ధనమ్మ

Telugu Kavithalu