http://www.teluguglobal.com/wp-content/uploads/2015/07/bad-smell-in-mouth.jpg
2015-07-06 23:14:28.0
నోరు తెరిచి నలుగురిలో మాట్లాడదామంటే దుర్వాసన వస్తోందని భయపడతున్నారా ? అయితే, చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ సమస్య బారి నుంచి బయట పడవచ్చు. నోటి దుర్వాసన రాకుండా ఉదయం, రాత్రి పళ్లను శుభ్రంగా తోముకోవాలి. రెండుసార్లు దంతాలు శుభ్రం చేసుకోవడం వలన దంతాల మధ్య ఉన్న పాచిని తొలగించవచ్చు. దంతాల మధ్య పేరుకున్న పాచిని ఫ్లాసింగ్ వంటి పద్దతుల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ప్రతి ఆరునెలలకు ఓసారి దంతవైద్యుడి వద్దకు వెళ్లి నోటిని పరీక్షించుకోవాలి. పంటిపై […]
నోరు తెరిచి నలుగురిలో మాట్లాడదామంటే దుర్వాసన వస్తోందని భయపడతున్నారా ? అయితే, చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ సమస్య బారి నుంచి బయట పడవచ్చు.
- నోటి దుర్వాసన రాకుండా ఉదయం, రాత్రి పళ్లను శుభ్రంగా తోముకోవాలి. రెండుసార్లు దంతాలు శుభ్రం చేసుకోవడం వలన దంతాల మధ్య ఉన్న పాచిని తొలగించవచ్చు.
- దంతాల మధ్య పేరుకున్న పాచిని ఫ్లాసింగ్ వంటి పద్దతుల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
- ప్రతి ఆరునెలలకు ఓసారి దంతవైద్యుడి వద్దకు వెళ్లి నోటిని పరీక్షించుకోవాలి. పంటిపై ఏర్పడిన నల్లటి గారను స్కేలింగ్ ద్వారా తొలగించుకోవాలి.
- చిగుళ్ల వ్యాధికి పంటిపై పేరుకున్న గారే ప్రధాన కారణం.
- ఆహారంలో పాల పదార్థాలు, విటమిన్ సి ఉన్న ఆహారాన్ని చేర్చుకోవాలి.
- సల్ఫర్ అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండడం
- స్వీట్లు, టీ, కాపీ, కూల్ డ్రింక్ లను పరిమితంగా తీసుకోవడం వలన నోటి దుర్వాసన నుంచి బయట పడొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నోటి దుర్వాసన తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
- చిగుళ్ల సమస‌్యలు, కిడ్నీ జబ్బులు, స్త్రీలకు నెలసరి సమయంలో విడుదలయ్యే హార్మోన్లు, జీర్ణ సమస్యలు, తీసుకునే ఆహారం కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. అందువల్ల డాక్టరును సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
bad smell,Health,Health Tips,medical news,mouth,tips,దుర్వాసన,దూరం,నోటి
https://www.teluguglobal.com//2015/07/07/bad-smell-in-mouth/