https://www.teluguglobal.com/h-upload/2022/09/20/500x300_401347-bp.webp
2022-09-20 12:41:14.0
బీపీ ఉన్నవాళ్లు నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం లాంటవి చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య బీపీ. మారుతున్న లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రక్తపోటు సమస్య ఇటీవల ఎక్కువైంది. అయితే బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బీపీ సమస్యను తగ్గించుకోవచ్చు.
మామూలుగా బీపీ పెరగడానికి ప్రధాన కారణం లైఫ్‌స్టై్ల్. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్ అవ్వడం, సరిగా నిద్రపోకపోవడం, మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తాయి. కాబట్టి వీటిని మార్చుకుంటే బీపీ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఒకవేళ బీపీ బారిన పడితే ఈ జాగ్రత్తలు మస్ట్.
35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ప్రతీ 3 నెలలకు ఒక సారి బీపీని చెక్ చేయించుకోవాలి. 130/90 కంటే రక్తపోటు అధికంగా ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. ఒకవేళ బీపీ ఉందని తేలితే లైఫ్‌స్టైల్‌లో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాలి.
బీపీ ఉన్నవాళ్లు నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం లాంటవి చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి.
బీపీ ఉన్న వాళ్లు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.చక్కెర వాడకాన్ని కూడా తగ్గిస్తే ఇంకా మంచిది. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మానేయాలి. వీలైనంత వరకూ పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, గింజలు, గింజ ధాన్యాలు తినాలి. తేనె, గోరువెచ్చని నీళ్ళు రోజూ తీసుకోవాలి.రోజూ వ్యాయామం చేయాలి.
Blood Pressure,Health Tips,BP
Blood Pressure, blood pressure normal range, blood pressure chart, blood pressure measurement, BP, Health, Health Tips, Telugu news, Telugu global news, Telugu global latest news, blood pressure in telugu, రక్తపోటు నివారణ, బీపీ, అలవాటు, వ్యాయామం, లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, రక్తపోటు సమస్య
https://www.teluguglobal.com//health-life-style/bp-is-normal-if-these-are-followed-344629