ఇస్కాన్‌ ప్రచారకులు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌.. స్పందించిన పవన్‌

2024-11-27 05:40:07.0

హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌కు విజ్ఞప్తి

https://www.teluguglobal.com/h-upload/2024/11/27/1381256-pawa.webp

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకులు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. దీనిపై కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలిచివేస్తున్నదని పేర్కొన్నారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని.. దేశ వనరులు ఖర్చు అవడంతో పాటు మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పవన్‌ పేర్కొన్నారు.