ఈడీ విచారణకు హాజరైన అజహరుద్దీన్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/08/1367218-azharuddin.webp

2024-10-08 06:51:20.0

హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు

 

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహమ్మద్‌ అజాహరుద్దీన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌( ఈడీ) విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజాహరుద్దీన్‌ మాట్లాడుతూ.. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలని అన్నారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.