ఈనెల 21న హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

2024-11-13 08:31:51.0

రెండు రోజుల పాటు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి

https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377371-droupadi-murmu.webp

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌ కు రానున్నారు. ఈనెల 21న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. 22న శిల్పకళా వేదికలో నిర్వహించే లోక్‌ మంతన్‌ -2024 కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు.

President of India,Draupadi Murmu,Hyderabad Tour,2 Days Tour