ఈ అలవాట్లు మానేస్తే జుట్టు తెల్లగా మారదంతే

https://www.teluguglobal.com/h-upload/2024/03/26/500x300_1313451-white-hair.webp
2024-03-26 13:30:33.0

ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య‌పానం, స్మోకింగ్‌, పోష‌కాల లోపం, జన్యుపరమైన స‌మ‌స్య‌లు, హార్మోన్ల అసమతుల్యత ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌ల్ల జుట్టు తెల్ల‌గా మారిపోతుంటుంది.

ఈ మ‌ధ్య కాలంలో యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారు విప‌రీతంగా పెరిగి పోతున్నారు. ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య‌పానం, స్మోకింగ్‌, పోష‌కాల లోపం, జన్యుపరమైన స‌మ‌స్య‌లు, హార్మోన్ల అసమతుల్యత ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌ల్ల జుట్టు తెల్ల‌గా మారిపోతుంటుంది. ఇక ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క‌.హెయిర్ క‌ల‌ర్స్ వాడుతూ తిప్ప‌లు ప‌డ‌తారు. అలాగే వీటితోపాటూ చుండ్రు, జుట్టు పల్చబడడం వంటి సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో జుట్టు తెల్లబడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

చిన్న వయసులో జుట్టు నెరసిపోవడానికి అనారోగ్యకరమైన ఆహారం అతిగా తీసుకోవడం, టెన్షన్ , విటమిన్ల, ఖనిజాల లోపం. రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తుల వాడడం, మద్యపానం,ధూమపానం కూడా కారణమే. విటమిన్ బి12 లోపం, అనీమియా, థైరాయిడ్, ఒత్తిడి.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలోనూ ఈ సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే జన్యుపరమైన సమస్యలు కూడా తెల్లజుట్టుకు కారణాలు అవుతాయి.

జుట్టు నెరవకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని రసాయన షాంపూలకు బదులుగా ఆర్గానిక్ షాంపూలను వినియోగించడం. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో షాంపూను లు వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుతం కెమికల్స్ ఉన్న హెయిర్ ఆయిల్స్, హెయిర్ స్ప్రేలు ఎక్కువగా లభిస్తున్నాయి. జుట్టు సువాసన రావడానికి చాలా మంది వాటినే వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలుత్వరగా వస్తాయి. కాబట్టి వాటికి బదులుగా బాదం, కొబ్బరి, ఆలివ్ నూనెలను వినియోగించడం, సహజమైన కండిషనర్ లను వాడటం మంచిది. జంక్ ఫుడ్ తినడం మానేసి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినండి. కూరగాయలు మరియు పండ్ల వినియోగాన్ని పెంచండి.

ముఖ్యంగా తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యపానం మానేయాలి. విటమిన్లు అందులోనూ విటమిన్ B-12 అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇది జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే, మీ జీవితం నుండి టెన్షన్‌ను తరిమికొట్టడం మరచిపోకండి. ఎందుకంటే టెన్షన్డి, ప్రెషన్ అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

White Hair,Home Remedies,Hair,Health
White Hair: 10 Causes, Prevention, and Home Remedies, White Hair Telugu, White Hair Telugu News, White Hair Telugu Tips, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య‌పానం, స్మోకింగ్‌, పోష‌కాల లోపం, జుట్టు తెల్ల‌గా మారిపోతుంటుంది

https://www.teluguglobal.com//health-life-style/white-hair-if-you-stop-these-habits-hair-will-not-turn-white-1014460