2025-02-17 10:42:46.0
భవిష్యత్ లో బీసీ సీఎం అవుతరు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణాకు ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంటారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఓబీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, సీఎం మార్పుపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఆయనే ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణాకు బీసీ సీఎం అనేది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాలు బీసీ ఎజెండాతోనే సాగుతున్నాయన్నారు. భవిష్యత్‌లో తెలంగాణాకు బీసీ సీఎం అవుతారని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించే దమ్ము కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీలో బీసీ సీఎం కాగలరా చెప్పాలన్నారు.
Caste Census,BC Politics,Revanth Reddy,Congress Party,Mahesh Kumar Goud