2023-11-05 10:57:39.0
https://www.teluguglobal.com/h-upload/2023/11/05/851509-chikati.webp
ఈ వేళ చుట్టూరా వ్యాపించిన
దట్టమైన చీకట్లోంచి…..
వెలుతురు వెయ్యి రెక్కలతో
నా వైపు కాంతులను వెదజల్లుతుంది.
అసంఖ్యాకమైన నక్షత్రాల కాంతి
రంగురంగుల తోరణాలను అడ్డుకున్నది.
మబ్బుల కాన్వాస్
మనిషిని అనేక అడ్డంకులు
అడ్డుకుంటాయి.
అయినా…సాగిపోతూనే ఉంటాం
కదలి కెరటాల వలే
పడి లేచే విజయాపజయాలు
జీవితం
ఒక మధుర సంభాషణ కాదు
జీవితం విషాదం
జీవితం వినోదం
జీవితం ఆనంద రసరాగం
జీవితం కన్నీటికి గీతం
ఈ చీకటి రాత్రి ఒంటరి గీతం
అంజనాశ్రీ
(ఖమ్మం బోనగిరి కోట)
Anjanashree,Telugu Kavithalu