ఈ డైట్‌తో ఎక్కువకాలం బతకొచ్చు

https://www.teluguglobal.com/h-upload/2022/10/31/500x300_423334-food.webp
2022-10-31 08:27:29.0

వీగన్ డైట్ అని, కీటో డైట్ అని.. ప్రస్తుతం చాలారకాల డైట్‌లు పాపులర్ అవుతున్నాయి. అయితే వీటన్నింటినీ తలదన్నేలా మరో కొత్త డైట్ పుట్టుకొచ్చింది. అదే ‘లాంజెవిటీ డైట్’. ఈ డైట్‌ ఫాలో అయితే ఏకంగా 120 ఏండ్లు జీవించే అవకాశం ఉంటుందట.

వీగన్ డైట్ అని, కీటో డైట్ అని.. ప్రస్తుతం చాలారకాల డైట్‌లు పాపులర్ అవుతున్నాయి. అయితే వీటన్నింటినీ తలదన్నేలా మరో కొత్త డైట్ పుట్టుకొచ్చింది. అదే ‘లాంజెవిటీ డైట్’. ఈ డైట్‌ ఫాలో అయితే ఏకంగా 120 ఏండ్లు జీవించే అవకాశం ఉంటుందట. ఈ డైట్ రూల్స్ ఎంటంటే..

లాంజెవిటీ అంటే ‘దీర్ఘాయువు’ అని అర్థం. అంటే ఈ డైట్.. ఎక్కువకాలం జీవించడం కోసం డిజైన్ చేశారన్న మాట. వాల్టర్ లాంగో అనే అమెరికన్ బయాలజిస్ట్ ఈ డైట్‌ను రూపొందించాడు. అయితే ఈ డైట్ ప్రత్యేకంగా వయసుపై బడిన వాళ్ల కోసం రూపొందించినట్టు వాల్టర్ లాంగో చెప్తున్నాడు.

రూల్స్ ఇవే..

ఈ డైట్ లో ఎక్కువ ఆకుకూరలు, తక్కువ ప్రొటీన్స్, ఉపవాసం.. అనే మూడు ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. ఈ డైట్‌లో ఆకుకూరలు, ఫ్రూట్స్, బీన్స్‌, నట్స్‌, ఆలివ్‌ నూనె, సీ ఫుడ్ లాంటివి తినాలి. మాంసం, పాల ఉత్పత్తులు చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫ్యాట్స్, షుగర్స్‌ను తీసుకోకూడదు. పాల ఉత్పత్తులను మానేయలేకపోతే ఆవు లేదా మేక పాలు తీసుకోవచ్చు. ఈ డైట్‌లో బరువుని బట్టి ప్రొటీన్లు తీసుకోవాలి. ఒక రోజులో ఒక కిలో బరువుకు 0.68 నుంచి 0.80 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 60 కిలోల బరువుంటే.. రోజుకు 40.8 నుంచి 48 గ్రాములకు మించి ప్రొటీన్లు తీసుకోకూడదు.

ఈ డైట్‌లో మరో రూల్ ఏంటంటే.. ఆహారాన్ని విడతల వారీగా తీసుకోవాలి. రోజులో తీసుకునే మొత్తం ఆహారాన్ని కేవలం 12 గంటల్లోనే తినాలి. ఉదాహరణకు ఉదయం 7 గంటలకు మొదటి మీల్ తీసుకుంటే సాయంత్రం 7 గంటల లోపు రెండు లేదా మూడవ మీల్‌ తినేయాలి. అలా 12 గంటల్లోపు తినేలా ప్లాన్ చేసుకోవాలి. మిగతా టైం అంతా ఉపవాసం ఉండాలి. భోజనానికి నిద్రకు మధ్య కనీసం నాలుగు గంటల గ్యాప్ ఉండాలి. అలాగే వారంలో రెండు రోజులు మాత్రం రెండు వేల కంటే తక్కువ క్యాలరీలుండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఈ డైట్‌లో ఉడికించిన, గ్రిల్ చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. బేకింగ్ ఫుడ్స్, వేగించిన ఫుడ్ తినకూడదు. విటమిన్, మినరల్ సప్లిమెంట్లు లేదా ఇతర మందులు వాడుతున్నవాళ్లు వాటిని కంటిన్యూ చేయొచ్చు. ఈ డైట్‌ను పాటించడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. టైప్‌2 డయాబెటిస్, ఒబెసిటీ, గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఇవన్నీ ఎక్కువ కాలం జీవించేందుకు సాయం చేస్తాయని వాల్టర్ లాంగో చెప్తున్నాడు

Live Longer,Health Tips,Eat,Vegan Diet,Keto Diet,The Longevity Diet
Live Longer, Health Tips, Health updates, health news, Eat, Vegan diet, Keto Diet, The Longevity Diet, The Longevity Diet Tips in Telugu, కీటో డైట్, వీగన్ డైట్, లాంజెవిటీ డైట్

https://www.teluguglobal.com//health-life-style/the-longevity-diet-what-to-eat-to-help-you-live-longer-and-healthier-355456