ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన

2025-01-25 14:54:15.0

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహతో ఆయన సమావేశమయ్యారు. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. కార్పోరెట్ ఆసుపత్రి తరహాలో అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. రోడ్డు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులు సీఎం సూచించారు. కార్పోరెట్ ఆసుపత్రి మాదిరిగా పార్కింగ్, మార్చురీ, ఇతర సౌకర్యాలుండాలని ఆయన సూచించారు.

Osmania Hospital,CM Revanth reddy,Osmania New Building,Health Minister Damodara Rajanarsimha,Telanagan goverment,CS Shanthikumari