2024-12-15 08:22:59.0
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు.
భారత దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు. పటేల్ కు నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు. దేశ సమగ్రత, సమైక్యతకు సర్దార్ పటేల్ చేసిన కృషిని వారంతా స్మరించుకున్నారు. ఇదిలాఉండగా, సర్దార్ పటేల్ కృషి వల్లే హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో భాగం అయ్యిందని అందరికీ తెలిసిందే. ఇండియన్ ఆర్మీని పంపించి నిజాం రాజును బెదిరించి హైదరాబాద్‌ను దేశంలో భాగం అయ్యేలా చేశారు.
CM Revanth Reddy,Sardar Patel,Minister Ponguleti Srinivas Reddy,Konda Surekha,former MLC Konda Murali,CM Advisor Vem Narender Reddy