2023-03-23 05:04:13.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/23/727958-ugadi2023.webp
పాతను పాతరేసిన
సరికొత్తదనం ఉగాది
వాసంతలీలకు పునాది
ఆగమించిన ఈ ఉగాది
కవనలోకపు యవనికపై
రసరమ్య ప్రాకృతిక చిత్రం
ఉగాది
ఆకుపచ్చని ఆలోచనలపై
నిలిచిన శిఖరాగ్రం ఉగాది
గండుకోయిలల
గమ్మత్తైన పాటకు
సింగారించిన పల్లవి ఉగాది
భవిష్యత్తుకు భాగ్యదర్శినిగా
దారి చూపే
దీపతోరణం ఉగాది
విజయ పరంపర ప్రారంభం
ఆరు రుచులతో ఆరంభం
ఉగాది అంటే
జీవన సందేశం
కష్టసుఖాల కలబోత
మంచిని ప్రసాదించే
శబ్ద శిల్పం
సంస్కృతీ ప్రతిబింబం
ఆత్మీయానుభూతుల
సమ్మేళనం
– డా. తిరునగరి శ్రీనివాస్
Dr Tirunagari Srinivas,Ugadi,Ugadi 2023