2015-06-08 20:20:36.0
బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ సృష్టిస్తుందని ఆయన మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో 90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి […]
బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ సృష్టిస్తుందని ఆయన మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడుతుందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో 90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకునేవారమో! ఆలోచించాలని’ అన్నారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారు ఏం సాధించారు?ప్రపంచానికి ఏమిచ్చారు? ఉగ్రవాదానికి విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. దాని లక్ష్యం ఒకటే. అదే మానవత్వంతో శత్రుత్వం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రం సహించబోమన్న బంగ్లా ప్రధాని హసీనా ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Modi on pakistan terrorism,Narendra Modi in Dhaka,Pakistan Creating nuisance,PM in Dhaka