ఉగ్రవాదులతో భారత సైన్యం కుమ్మక్కు.. ఫరూక్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు

2024-08-12 06:47:52.0

ఫరూఖ్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆరోపణలపై జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ స్పందించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/12/1351634-indian-armys-collusion-with-terrorists-farooq-abdullahs-sensational-allegations.webp

భారత సైన్యంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదులతో కుమ్మక్కయిందని ఆరోపించారు. భద్రతా దళాలను సరిహద్దుల వెంబడి భారీగా మోహరించినా, ఉగ్రవాదులు యథేచ్ఛగా భారత్‌లోకి చొరబడుతున్నారన్నారు. “200నుంచి 300 మంది తీవ్రవాదులు ఎలా వచ్చారు? వారు ఎక్కడ నుండి వచ్చారు? మన కల్నల్, మేజర్, సైనికులు చనిపోతున్నారు. ఇదంతా ఎలా జరుగుతోంది?. దీనికి బాధ్యులు ఎవరు?. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఇప్పుడు ఇదే సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి” అని ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

ఫరూఖ్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆరోపణలపై జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ స్పందించారు. దేశ రక్షణలో ఇప్పటివరకు 7వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మన సైనికులు శత్రుమూకలను ఎదుర్కోవడంలో ముందుండే దేశభక్తులని, అలాంటి వారిపై విమర్శలు బాధాకరమని అన్నారు.

Indian Army,Collusion,Terrorists,Farooq Abdullah,Sensational allegations