ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్‌ కోడ్‌

2025-01-27 12:54:48.0

దేశంలో యూసీసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1398058-uttarakhanducc.webp

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమల్లోకి తెచ్చింది. దేశంలోనే యూసీసీని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తమదని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ దామీ ప్రకటించారు. సోమవారం డెహ్రాడూన్‌లో యూసీసీ రూల్స్‌కు సంబంధించిన పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామీ మాట్లాడుతూ, ఇది తమ రాష్ట్ర ప్రజల, ఈ దేవభూమి ఘనత అని ప్రకటించారు. ప్రజలు తమను ఆశీర్వదించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని కులాలు, మతాలకు చెందిన ప్రజలందరికీ సమాన హక్కులు ఈ చట్టం ద్వారా సమకూరుతాయన్నారు. ఇదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Uniform Civil Code,Uttarakhand,Officially Implemented,CM Pushkar Singh Dhami