2024-09-24 13:24:36.0
తమిళనాడు డిప్యూటీ సీఎంగా చాన్స్ : హింట్ ఇచ్చిన స్టాలిన్
https://www.teluguglobal.com/h-upload/2024/09/24/1362616-stalin-udayanidhi.webp
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ త్వరలోనే ప్రమోట్ కాబోతున్నడు.. అవును! తమిళనాడుకు త్వరలోనే ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయబోతున్నారు. దీనిపై స్టాలిన్ హింట్ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో మీడియాలో స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు, మంత్రివర్గ విస్తరణపై ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని చమత్కరించారు. తద్వారా తన కొడుకు డిప్యూటీగా ప్రమోట్ కాబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమెరికా పర్యటనలో సాధించిన పెట్టుబడులపై ప్రత్యేకంగా శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీస్ మినిస్టర్ రాజా ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. 18 కంపెనీలతో రూ.7,616 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఉదయనిధి త్వరలోనే డిప్యూటీ సీఎం కాబోతున్నారని కొన్ని రోజుల క్రితం మంత్రి అన్బరసన్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ కామెంట్స్ ను ఉదయనిధి కొట్టిపారేసినా తాను డిప్యూటీ సీఎం కావాలా లేదా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం అంటూ సమాధానం ఇచ్చారు.
Tamilanadu,CM Stalin,Minister Udayanidhi Stalin,Cabinet expansion,Deputy CM Chance to Udayanidhi