ఉదయపునడక కుచ్చీలు

2022-12-22 13:24:00.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/22/432342-morning.webp

నీటిచప్పుడు:

————

తను నడుస్తున్నంత సేపూ

కరవాణి లో మాట్లాడుతూనేవుంది –

కన్నీళ్ళు ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ

అమ్మతో కాబోలు!!

పిడప సుందరి

—————

ఈవిడెవరో పార్క్ లోకి

పిడపవేసుకుని మరీ

పవిత్రంగా విచ్చేసింది –

చేసంచితో

చేమంతులకాజేత కోసం!

హిమస్నాతసుమాలు

ఉలికిపడుతున్నాయి

కరకువేళ్ళ దురుసుతో!!

చరచరవాణి:

——————

అతడు వేగపునడకతోనే

ఆదేశిస్తున్నాడు

పనులపరుగుల ఇల్లాలిని-

స్నానానికి నీళ్ళు సిద్ధం

చెయ్యమని!

ఇంకా చెయ్యలేదంటూ ఆవేశిస్తున్నాడు కూడా –

చరవాణితో ఆమె

అగచాట్లు రెట్టింపు!!

వైరుద్ధ్యం

————-

కరవాణి మోగింది –

పనమ్మాయి!

నా గుండె గుభిలు –

ఇవాళ రాదు కాబోలు!!

చుట్టూ సౌందర్యంతో

తలంట్లు పూర్తికాకనే

ఇంట వేచివున్న

అంట్లగిన్నెలవైపు

సగమూ సాగని తాపీనడ

తహతహల పరుగయింది

– ఘంటసాల నిర్మల

Ghantasala Nirmala,Telugu Kavithalu