ఉప్పల్‌ ఎమ్మెల్యే కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

2025-02-14 10:32:11.0

కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ

ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. లక్ష్మారెడ్డి సోదరు వెంకట్‌ రెడ్డి సతీమణి పద్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. సైనిక్‌పురిలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే వెంకట్‌ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పద్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Uppal MLA,Bandari Laxma Reddy,Bandari Venkat Reddy,MLC Kavitha,Console