https://www.teluguglobal.com/h-upload/2024/05/17/500x300_1328498-salt.webp
2024-05-17 15:06:18.0
పద్ధతి తప్పిన ఆహారపు అలవాట్లు పలు రకాల జబ్బుల కు దారితీస్తున్నాయి. ఇందులో అధిక ఉప్పు వినియోగం కూడా ఒకటి..సైలెంట్ కిల్లర్ గా చెప్పుకొనే హైబీపీ కి కారణం ఉప్పు. మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది.
పద్ధతి తప్పిన ఆహారపు అలవాట్లు పలు రకాల జబ్బుల కు దారితీస్తున్నాయి. ఇందులో అధిక ఉప్పు వినియోగం కూడా ఒకటి..సైలెంట్ కిల్లర్ గా చెప్పుకొనే హైబీపీ కి కారణం ఉప్పు. మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది.
అధిక ఉప్పు వినియోగం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. అంతే కాదు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది.

పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది తాము సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది.

దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఎక్కువగా ఉప్పు వినియోగించే అలవాటు మానుకోవటానికి డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. తాజావి , తక్కువగా ప్రాసెస్ చేసిన పదార్ధాలు తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని డబ్ల్యూహెచ్ వో సూచించింది. ఉప్పు బదులుగా సుగంధ ద్రవ్యాలు వాడమని సలహా ఇచ్చింది.
World Hypertension Day,World Hypertension Day 2024,WHO,Salt
World Hypertension Day, World Hypertension Day 2024, WHO, salt
https://www.teluguglobal.com//health-life-style/today-is-world-hypertension-day-who-says-that-reducing-salt-can-reduce-the-risk-1031451