2023-07-11 19:51:34.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/11/794165-una-mah.webp
పుట్టింట
కార్బన్ కాపీలానూ
మెట్టినింట
ఫొటోస్టాట్ కాపీలానూ
సమాజంలో
సైక్లోస్టైల్డ్ కాపీలానూ
బతకొద్దు
(22.7.95)
‘పోత’ లెందరో
‘పూత’ లెందరు ?
(23 .7.95 )
అందరిలోనూ
అవే ముడి జీవ సరుకులు
కానీ –
ఎవరి జీవన రసాయనాన్ని
వారే తయారు చేస్కోవాలి.
(27.7.95)
జీవనయానం అంటే –
జననం నించి మరణం వరకూ
సాగేది కాదు
తెలియని తనం నుంచి
తెలిసేతనానికి సాగేది
(25-7-95)
`పుత్తడి’ని తూచేది
‘ఇత్తడి’
(26.7.95)
మనసు కోరుతుంది.
మెదడు ఆలోచిస్తుంది
మేధ సృష్టిస్తుంది.
(31.7.95)
మూలమూలల కెడితే చీకటి
మూలాల మూలాల కెడితే వెలుగు
(1-8-95)
– పిశుపాటి ఉమామహేశ్వరమ్
Uma Ruku,Telugu Kavithalu,Pishupati Umamaheswaram