2025-01-28 13:42:35.0
ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై మంత్రి దామోదర అధికారులతో చర్చించారు.
ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ నెల 25న జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్లలో పలు మార్పులు సూచించారు. దీంతోముఖ్యమంత్రి సూచనల ఆధారంగా అధికారులు డిజైన్లలో మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన డిజైన్లను మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారులు ప్రజెంటేషన్ పై మంత్రి పలు సలహాలు ఇచ్చారు. కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం స్థల కేటాయింపు కూడా చేసింది.
గోషామహాల్ లో ని పోలీస్ స్టేడియంలో ఉస్మానియా కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నూతన భవనాల నిర్మాణానికి శర వేగంగా అడుగులు వేసింది.ఇందులో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కొత్త భవనాల నిర్మణానికి శంకుస్థాపన తేదీలను ఈ నెల 31న ఖరారు చేశారు. ఆసుపత్రి భవనాల నిర్మాణాలలో ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, రాబోయే వదేళ్ల అవసరాలకు తగినట్టుగా అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆసుపత్రి భవనాలతో పాటు భోదనా సిబ్బందికి, విద్యార్థులకు హస్టల్ వసతుల భవనాలలో కూడా నియమనిబంధనలు పాటించాలని ఆదేశించారు.
Minister Damodar,Osmania Hospital,CM Revanth reddy,Health Minister Damodar Rajanarsimha,foundation stone laying ceremony,Police Stadium in Goshamahal,Health R&b Departments