2025-01-31 06:58:34.0
రూ. 2,400 కోట్లతో 14 అంతస్తుల్లో నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. గోషామహల్ మైదానంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానున్నది.రూ. 2,700 కోట్లతో 14 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసే విధంగా సౌకర్యాలు కల్పించనున్నారు. కొత్త ఆస్పత్రి భవనంలో డాక్టర్ల సంఖ్య 20 శాతం పెరగనున్నది. రోజూ సుమారు 5 వేల మందికి ఓపీ సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంగా తీర్చిదిద్దాలని సర్కార్ భావిస్తున్నది. ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్న22 విభాగాలకు అదనంగా ఎనిమిది విభాగాలు చేర్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేట్ విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నది. అవయవ మార్పిడి కోసం అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేయనున్నారు. 2026-2027 నాటికి ఉస్మానియా నూతన భవనం నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రక దినం అన్నారు. మాకు కొత్త ఉస్మానియా ఆస్పత్రి కావాలని ౩౦ ఏళ్లుగా ఒక కల ఉండదన్నారు. హెరిటేజ్ బిల్డింగ్ అని ఆ అంశం హైకోర్టులో ఉండటం వంటి వివిధ కారణాలతో వాయిదా పడింది. అయితే దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఒక బ్రాండ్ ఉందన్నారు. ఈ కాలేజీ నుంచి సమాజానికి డాక్టర్లను అందిస్తున్నాం. రూ. 2,700 కోట్లతో అత్యాధునిక వసతులతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనున్నదని మంత్రి తెలిపారు.
Foundation stone laying,New Osmania Hospital,CM Revanth Reddy,Located at Goshamahal,Batti Vikramakarka,Damodara Raja Narsimha