ఊరికే జబ్బు పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

https://www.teluguglobal.com/h-upload/2024/07/05/500x300_1341997-sick.webp
2024-07-05 21:24:24.0

తరచూ జబ్బు పడడానికి ప్రధానమైన కారణం ఇమ్యూనిటీ బలంగా లేకపోవడం. ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా డైట్‌లో సిట్రస్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యం అందరిలో ఒకేలా ఉండదు. కొందరు ఎప్పుడూ హెల్దీగా ఉంటే మరికొందరు మాత్రం తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి వాళ్లు కొన్ని బేసిక్ అలవాట్లు సరిచేసుకోవడం ద్వారా ఎప్పుడూ హెల్దీగా ఉండేలా చూసుకోవచ్చు. అవేంటంటే..

తరచూ జబ్బు పడడానికి ప్రధానమైన కారణం ఇమ్యూనిటీ బలంగా లేకపోవడం. ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా డైట్‌లో సిట్రస్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజుకి మూడు నాలుగు లీటర్ల నీటిని తప్పక తాగుతుండాలి.

శరీరానికి నిద్ర సరిపోకపోతే ఆ ఎఫెక్ట్ ఓవరాల్ హెల్త్‌పై పడుతుంది. నిద్ర లోపించే వారు తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. కాబట్టి నిద్ర చక్కగా పోయేలా చూసుకోవాలి. అలాగే ఒత్తిడి కూడా శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఒత్తిడి ఉంటే వచ్చే రోగాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి తరచూ రోగాల బారిన పడుతున్నవాళ్లు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

శరీరంలో జింక్ లోపించడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి నట్స్, ఆకుకూరల వంటివి తీసుకుంటూ శరీరానికి జింక్ అందేలా చూసుకోవాలి. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ప్రొబ్యాక్టీరియా ఉండే పెరుగు, టోఫూ వంటివి తీసుకుంటుండాలి. ఇలా చేస్తే రోగాలు దరి చేరవు.

శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతుంటుంది. ఎప్పుడూ కూర్చొని పని చేసేవాళ్లు ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వని వాళ్లు ఎక్కువగా సిక్ అవుతుంటారు. కాబట్టి ఇలాంటివాళ్లు తప్పక వ్యాయామం చేయాలి. ఎండలో కాసేపు నడవాలి.

ఇకపోతే వ్యక్తిగత శుభ్రత లేకపోవడం వల్ల కూడా చాలామంది జబ్బు పడుతుంటారు. సీజన్స్ మారేటప్పుడు వేడినీళ్లు ఎక్కువగా తాగడం, ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు ద్వారా క్రిముల ద్వారా వచ్చే రోగాల నుంచి తప్పించుకోవచ్చు.

Vitamin C,immune system,Health Tips,Sick
vitamin C, Vitamin C food, immune system , sick

https://www.teluguglobal.com//health-life-style/are-you-just-sick-try-this-1046061