2015-04-28 20:45:48.0
శ్రీరాముని భార్య సీత! మరి లక్ష్మణుని భార్య? ఊర్మిళ! ఊర్మిళ ఎవరో కాదు, సీత పిన తండ్రి కూతురు. సీతా రాముల కళ్యాణమప్పుడే ఊర్మిలా లక్ష్మణుల కళ్యాణమూ జరిగింది. శ్రీరాముని వెంట సీత అరణ్యవాసానికి వెళ్ళింది. అన్న వెంట వెళ్ళిన లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనే అనుకుంది. కాని లక్ష్మణుడు ఒప్పుకోలేదు. పైగా ఊర్మిళని లక్ష్మణుడు ఒక కోరిక కోరాడు. తన నిద్రనంతా తీసుకొని ఆమె మెలకువనంతా ఇవ్వమని కోరాడు. ఇచ్చింది. ఫలితమే పధ్నాలుగేళ్ళ […]
శ్రీరాముని భార్య సీత!
మరి లక్ష్మణుని భార్య?
ఊర్మిళ!
ఊర్మిళ ఎవరో కాదు, సీత పిన తండ్రి కూతురు. సీతా రాముల కళ్యాణమప్పుడే ఊర్మిలా లక్ష్మణుల కళ్యాణమూ జరిగింది.
శ్రీరాముని వెంట సీత అరణ్యవాసానికి వెళ్ళింది. అన్న వెంట వెళ్ళిన లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనే అనుకుంది. కాని లక్ష్మణుడు ఒప్పుకోలేదు. పైగా ఊర్మిళని లక్ష్మణుడు ఒక కోరిక కోరాడు. తన నిద్రనంతా తీసుకొని ఆమె మెలకువనంతా ఇవ్వమని కోరాడు. ఇచ్చింది. ఫలితమే పధ్నాలుగేళ్ళ వనవాసంలో లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఈ పధ్నాలుగేళ్ళ కాలంలో ఊర్మిళకు ఒక్క క్షణమూ మెలకువ రాలేదు! ఏకథాటిగా నిద్రపోయింది ఊర్మిళ. తెలివి లేని నిద్ర… నిద్రలోనే జీవితం గడిచిపోయింది. అందుకనే “ఊర్మిళాదేవి నిద్ర”కి అంత ప్రాముఖ్యత!
కుంభకర్ణుడిది ఆరుమాసాలు నిద్రయితే – ఆరుమాసాల తిండి. కాని ఊర్మిళ నిద్ర తప్ప ఆహారం తీసుకోలేదు!
ఊర్మిళాదేవి అనగానే ఆమె నిద్ర తప్ప, ఆమెని గురించిన కథ లేదు. ఔను మరి… నిద్రలోనే గడిపాక ఇంక కథేముంటుంది?
రాముని అరణ్యవాసం పూర్తయింది. రావణ సంహారమూ జరిగిపోయింది. అయోధ్యకు అంతా తిరిగి వచ్చారు. రామునికి పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు చిన్న కునుకు తీసాడు. అంటే అప్పుడే ఊర్మిళను నిద్ర లేపారట. లేపి లక్ష్మణుని ఆనవాళ్ళు చెప్పేరట. భర్త లక్ష్మణుని కూడా పోల్చుకోలేనంతగా నిద్రలోనే ఉండిపోయింది ఊర్మిళ! ఈ కథనే జానపదులు పాట రూపంలో పాడుతారు. “ఊర్మిళాదేవి నిద్ర”గా ప్రాచుర్యం పొందింది!
నిద్రకు దగ్గరగా భర్తకు దూరంగా ఉంది కాబట్టే ఊర్మిళ అంటే లక్ష్మణుని భార్య అని మాత్రమే కాదు, “భర్తను వదిలిన స్త్రీ” అని కూడా అర్థం వుంది!
ఔను మరి… భర్తను అన్నేళ్ళు ఎవరొదిలేస్తారు? ఊర్మిళ తప్ప!.
– బమ్మిడి జగదీశ్వరరావు
about Urmila in Ramayanam,Urmila Wife of Lakshmana
https://www.teluguglobal.com//2015/04/29/storu-about-urmila-wife-of-lakshmana/