2025-01-23 14:10:16.0
విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
రాబోయే ఎండాకాలంలో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం ప్రజాభవన్ లో ఎండాకాలంలో కరెంట్ సరఫరాకు సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. విద్యుత్ సమస్యలపై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ 1912పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. 1912కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో మార్చి నెలలో పీక్ డిమాండ్ 6,328 మెగావాట్లు ఉందని.. ఆ మేరకు కరెంట్ సరఫరా చేసేలా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై విస్తృత సమావేశాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Electricity Supply,Summer Action Plan,do not cut the power,Batti Vikramarka