2025-01-09 13:04:10.0
వారానికి 90 గంటలు పనిచేయాలి. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నఎల్ అండ్ టీ ఛైర్మన్
https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1393062-lt.webp
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారి తీసిన విషయం విదితమే. తాజాగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.ఆదివారాలు కూడా పనిచేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.
ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు పనిచేయాలి. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలి. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను’ అంటూ వారితో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య ప్రస్తావన తీసుకువస్తూ ఆయన మాట్లాడిన మాటలను కొందరు తీవ్రంగా విమర్శించారు.
గతంలో నారాయణమూర్తి ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.
Infosys,L&T chairman SN Subrahmanyan,90-hour workweek,’How long can you stare at your wife?’Sparks criticism