2025-01-28 10:16:52.0
ఎక్స్‌పీరియం పార్క్ అనేది బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని,అది తెలంగాణ, హైదారాబాద్ సిటీకి వన్నె తెస్తుందని సీఎం రేవంత్ అన్నారు
రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతు వికారబాద్‌ను ఎకో టూరిజం స్పాట్‌గా చేస్తామని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల జాతుల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. రూ. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతం ఈ ఎక్స్‌పీరియం పార్క్. దీని కోసం రాందేవ్‌రావ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఏకంగా 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “ఎకో టూరిజంపై ఇటీవలే శాసన సభలో చర్చించమన్నారు. పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సాహిస్తాం.
అటవీ ప్రాంతాల సందర్శన కోసం మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆలయాల దర్శనాల కోసం తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాం.ఎక్స్‌పీరియం పార్క్ అనేది బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని,అది తెలంగాణ, హైదారాబాద్ సిటీకి వన్నె తెస్తుందన్నారు. ఇంతటి అద్భుతమైన పార్కు ఏర్పాటు చేసిన రామ్ దేవ్ ఒక వ్యాపార వేత్త కాదని ఒక కళాకారుడని కొనియాడారుఈ సందర్భంగా మెగాస్టర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ చాలా బిజీగా ఉన్నా ఈ పార్కు ఓపెనింగ్‌కు రావడం సంతోషమని పేర్కొన్నారు. ఇలాంటి పార్కులకు సీఎం రేవంత్ ప్రోత్సాహం అందించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Reddy,Experium Park,Vikarabad,Eco tourism spot,Randevrao,Megastar Chiranjeevi,Mahender Reddy,Minister Jupalli Krishna Rao,Revanth Reddy,World Class Park,Rangareddy District,Telangana,Poddutur