ఎగ్జామ్స్ టైంలో ఏం తినాలంటే..

https://www.teluguglobal.com/h-upload/2024/03/05/500x300_1303643-exam-diet.webp
2024-03-06 04:43:47.0

ప్రస్తుతం పరీక్షల సమయం నడుస్తోంది. ఈ టైంలో యాక్టివ్‌గా ఉంటూ మెదడుని చురుగ్గా ఉంచుకోవాలంటే డైట్‌లో తగిన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం పరీక్షల సమయం నడుస్తోంది. ఈ టైంలో యాక్టివ్‌గా ఉంటూ మెదడుని చురుగ్గా ఉంచుకోవాలంటే డైట్‌లో తగిన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎగ్జామ్స్ టైంలో డైట్ ఎలా ఉండాలంటే.

పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆహారం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పరీక్షల టైంలో ఒత్తిడి, మతిమరుపు వంటివి లేకుండా ఉండేందుకు కొన్ని ఫుడ్స్‌ను తీసుకుంటే మంచిది.

ముందుగా ఎగ్జామ్స్ టైంలో బద్ధకం, మగతగా అనిపించే పదార్థాలను అవాయిడ్ చేయాలి. అంటే అరగడానికి ఎక్కువ టైం పట్టే నాన్ వెజ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాల వంటి వాటిని పూర్తిగా తగ్గించాలి.

ఎగ్జామ్స్ టైంలో యాక్టివ్‌గా ఉండేదుకు ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల మెదడు కూడా చురుగ్గా ఉంటుంది.

ఎగ్జామ్స్ టైంలో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే డ్రై ఫ్రూట్స్, నట్స్‌, చేపలను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే తాజాగా ఉండే ఫ్రూట్స్, ఆకుకూరల వంటి ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా అలసట, మల బద్ధకం వంటవి రాకుండా చూసుకోవచ్చు.

పరిక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మరింత యాక్టివ్‌గా ఉండేందుకు గ్రీన్ టీ, కాఫీ వంటివి తీసుకోవచ్చు. అలాగే పిల్లలు రోజూ కొంత పాలు తాగడం కూడా మంచిదే.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఎగ్జామ్‌కు వెళ్లడానికి రెండు గంటల ముందే భోజనాన్ని ముగించేలా చూసుకోవాలి. తినేసి పరీక్షకు వెళ్లడం ద్వారా మగతగా అనిపించే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామ్స్ టైంలో మెటబాలిజం ఎక్కువగా ఉండేందుకు రోజూ ఎక్సర్‌‌సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్ర పోవడం కూడా ముఖ్యమే.

Diet Plan,Students,Exams,Diet Plan For Exams,Health Benefits,Food,Exam Diet
Diet plan, students, Diet Plan For Exams, Health benefits, telugu news, telugu global news, health, పరీక్ష, డైట్‌, ఆహారం, పరీక్షల సమయం

https://www.teluguglobal.com//health-life-style/exam-diet-diet-plan-for-students-during-exams-1007704