2024-10-17 14:02:57.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/17/1370058-kagana.avif
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
తన సినిమా ఎమర్జెన్సీ కి ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నామని ఆమె పేర్కొంది. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని కంగన తెలిపింది. ఫ్యాన్స్ ఓపికతో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని కంగన తన ఇన్స్టాగ్రామ్లో తెలిపింది.
కంగన స్వీయ దర్శకత్వంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల పట్ల ఓ వర్గం వారు అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సెన్సార్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు సన్నివేశాలను తొలగించడానికి సినీ మేకర్స్ ఒప్పుకోవడం వల్ల తాజాగా సర్టిఫికెట్ జారీ అయ్యింది.
‘Emergency’ movie,Censor Certificate,Actress Kangana Ranaut,Indira Gandhi Political Life,Pm modi,Rahul gandhi