ఎన్డీఆర్‌ఎఫ్‌ కార్యాలయాలను ప్రారంభించిన అమిత్ షా

2025-01-19 08:25:06.0

గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు

https://www.teluguglobal.com/h-upload/2025/01/19/1395822-amith-shaj.webp

విజయవాడ గన్నవరంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకలను హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఏపీ పర్యటనలో భాగంగా అమిత్‌షా ఉదయం బీజేపీ నేతలతో సమావేశం అయిన ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు బండి సంజయ్‌, రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలను ఆయన వీక్షించారు. దేశంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ కు 16 బెటాలియన్లు ఉండగా.. గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కావడం విశేషం.