ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్‌ నేరగాళ్ల నగ్న వీడియో కాల్‌

2025-03-05 07:20:38.0

ఆ వీడియోను తాజాగా ఎమ్మెల్యే నంబర్‌కు పంపించి బెదిరింపులు

ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్‌ మోసం నుంచి త్రుటిలో బైటపడ్డారు. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఆయనకు నగ్న వీడియో కాల్‌ చేశారు. దాన్ని నిందితులు స్క్రీన్‌ రికార్డింగ్‌ చేశారు. అనంతరం ఆ వీడియోను తాజాగా ఎమ్మెల్యే నంబర్‌కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. సైబర్‌ మోసగాళ్ల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకిరేకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనతో ఆ నంబర్‌ను ఎమ్మెల్యే బ్లాక్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ.. సైబర్‌ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలపారు. 

Cybercriminals target,Nakrekal MLAVemula Veeresham,With nude video call,Demand money.