https://www.teluguglobal.com/h-upload/2024/10/22/1371272-jeevan-reddy.webp
2024-10-22 05:22:53.0
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని జీవన్‌రెడ్డి ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగిరెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆదివారం ఉదయం సంతోష్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన గంగారెడ్డిని స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరణించాడు. ఈ హత్యకు నిరసనగా జగిత్యాల పాత బస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. సోదరుడి లాంటి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్లు జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేనప్పుడు తామెందుకని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రభుత్వమా? అని ధ్వజమెత్తారు. అయితే గ్రామంలోని రాజకీయ కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
MLC Jeevan Reddy’s,main follower,Brutal murder,Jeevan Reddy angry