2025-01-04 16:09:53.0
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
ఎయిర్ ఇండియాను టాప్ క్లాస్ ఎయిర్ లైన్స్ సంస్థగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఎన్‌ఐటీ తిరుచ్చిలో నిర్వహించిన గ్లోబల్ అలూమ్నీ మీట్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే ఎయిర్ ఇండియాను అత్యుత్తమ సంస్థగా నిలుపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. ఈ సభకు వచ్చిన వాళ్లంతా బోయింగ్ ఎయిర్ బస్ విమానాలు త్వరగా అందించేలా తనపై ఒత్తిడి పెంచాలన్నారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. 2026 నుంచి టాటా గ్రూప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని, విద్యాసంస్థలు దీనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
TATA Group,Air India,Chandrashekaran,NIT Thiruchi,Semi Conductor Industry