2024-11-14 14:17:21.0
రూ.303.62 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ లో చెల్లించేందుకు ఉత్తర్వులు
https://www.teluguglobal.com/h-upload/2024/11/14/1377853-contonment-board.webp
సికింద్రాబాద్ లోని పారడైజ్ సర్కిల్ నుంచి శామీర్‌పేట్ వరకు, డెయిరీ ఫామ్ వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి డిఫెన్స్ భూములు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ భూములకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.303.62 కోట్లు చెల్లించేందుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఇండియాలో డిపాజిట్ చేయనుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవే 44లో గల డెయిరీ ఫామ్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ కారిడార్లకు అవసరమైన డిఫెన్స్ భూములకు పరిహారంగా ఇచ్చే మొత్తంతో కంటోన్మెంట్ ఏరియాలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం, పికెట్ నాలాలో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయడం, హస్మత్‌పేట నాలా అభివృద్ధి సహా పలు పనులు చేపట్టనున్నారు.

Secunderabad,Cantonment Board,Paradise to Shamirpet,Elevated Corridors