2025-02-19 15:49:28.0
ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్ధీకరణకు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.పది శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఔట్లలో మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించింది.
నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ఒక లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద చెల్లింపులు జరిపి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Telangana government,LRS,Regularization of plots,Deputy CM Bhatti Vikramarka,Minister Ponguleti Srinivas Reddy,Minister Sridhar Babu,CM Revanth reddy,Congress party,BRS Party,KCR,KTR