ఎవరూ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు

2025-01-31 08:50:56.0

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్టీఏ పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనిచేయాలన్న చంద్రబాబు

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399132-babu.webp

ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎవరూ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్టీఏ పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనిచేయాలన్నారు. తొలిసారి గెలిచిన, కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదు. గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత 16,347 టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నాం. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహనకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం-విజయనగరం- విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. మార్చి 3న ఫలితాలను వెల్లడించనున్నారు.