2025-02-15 10:46:35.0
ఏపీ మంత్రి నారా లోకేశ్
https://www.teluguglobal.com/h-upload/2025/02/15/1403693-nara-lokesh-1.webp
ఎస్సీ యువడికిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు. వంశీ అరెస్టుపై శనివారం ఆయన స్పందించారు. వంశీ అరెస్టుకు సంబంధించిన కేసులో వాస్తవాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని రెడ్ బుక్ చూపించి చెప్పామని గుర్తు చేశారు. టీడీపీ నాయకులను ఐదేళ్లు చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే ఇబ్బంది పెట్టారని, చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకు రాకుండా గేటుకు తాళ్లు కట్టారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి, పార్టీ ఆఫీసులపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని అన్నారు.