ఏంటి సిగ్గులేని రాజకీయాలు

2024-10-02 11:17:37.0

సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా ? : ప్రకాశ్‌ రాజ్‌

సినీ నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్‌ ఆస్కింగ్‌ అని ప్రశ్నించారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్‌ కారణమని, చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఆయనే కారణమని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ మండిపడ్డారు. కొండా సురేఖ కామెంట్స్‌ పై రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి స్పందించారు. ”ఆ సంగతి మీకెవరు చెప్పారు? వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలు ఉన్నాయా? రాష్ట్ర మంత్రి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరే ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చి మాట్లాడితే ఎలా.. ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధపడ్డారు. ఆ బాధ సహజమే.. కానీ సాటి మహిళల్ని మీరే గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని ఆశించడం ఆత్యాశే కదా? మీరు మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలు, మీరంటే గిట్టని వాళ్లే కాదే స్వయంగా మీ పార్టీ ఇలా ప్రచారం ఇలా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉంది. మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పే. అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఏది మాట్లాడినా ఎదరు మాట్లాడొద్దు అంటే కుదరదు.. యథా రాజా తళా ప్రజా!” అని కుండబద్దలు కొట్టారు.

minister konda surekha,heroin samantha,divorce,surekha comments,prakash raj reaction