ఏటూరు నాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/01/1382458-encounter.webp

2024-12-01 03:46:44.0

భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్‌ పాపన్నతో పాటు అతని దళ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న, ఎలగోపు మలయ్య అలియాస్‌ మధు, ముస్సకి అలియాస్‌ కరుణాకర్‌, ముస్సకి జమున, జైసింగ్‌, కిషోర్‌, కామేశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

 

Massive encounter,Eturunagaram,Seven Maoists killed,Security forces firing,Mulugu District