ఏథర్‌ 450 సిరీస్‌ లో నాలుగు కొత్త మోడల్‌ స్కూటర్లు

2025-01-04 12:30:18.0

రూ.1.30 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ధరలు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ సంస్థ ఏథర్‌ 2025లో 450 సిరీస్‌లో నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆయా స్కూటర్ల ఎక్స్‌ షోరూమ్‌ ధరలు, వాటి స్పెసిఫికేషన్స్‌ను సంస్థ వెల్లడించింది. ఏథర్‌ 450ఎస్‌ ను 2.9 కిలో వాట్‌ బ్యాటరీ సదుపాయంతో తీసుకువచ్చింది. గంటకు 122 కి.మీ.ల (ఇండియన్‌ డ్రైవింగ్‌ కండీషన్స్‌ రేంజ్‌ – ఐడీసీ రేంజ్‌)లో తెచ్చిన ఈ స్కూటర్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌ రూ.1,29,99గా నిర్ణయించారు. ఏథర్‌ ఎక్స్‌ (2.9 కిలోవాట్‌) రేంజ్‌ గంటకు 126 కి.మీ.లు ఉంటుందని, ఈ స్కూటర్‌ ధర రూ.1,46,999లని వెల్లడించారు. ఏథర్‌ ఎక్స్‌ (3.7 కిలోవాట్‌) మోడల్‌ రేంజ్‌ గంటకు 161 కి.మీ.లు అని.. దీని ధర రూ.1,56,999లని ప్రకటించారు. ఏథర్‌ 450 అపెక్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.1,99,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ గంటకు 157 కి.మీ.ల స్పీడ్‌తో దూసుకుపొతుందని తెలిపారు. ఈ నాలుగు మోడళ్ల స్కూటర్లలో ఎంఆర్‌ఎఫ్‌ మల్టీ కాంపౌండ్‌ టైర్లు వినియోగించారు.. వీటితో స్కూటర్‌ కు ఎక్కువగా గ్రిప్‌ ఉంటుందని తెలిపారు. గూగుల్‌ మ్యాప్స్‌, అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, వాట్సప్‌ నోటిఫికేషన్‌ లాంటి ఫీచర్లు ఈ స్కూటర్లలో ఉన్నారు. 2.9 కిలోవాట్ల బ్యాటరీని మూడు గంటల్లోనే చార్జింగ్‌ చేసుకోవచ్చని ఏథర్‌ సంస్థ ప్రకటించింది.

Aether 450 series,New Models,Rs.1.30 Lakh to Rs.2 Lakh Price Range,Electric Scooters