2025-01-10 00:37:19.0
ఈ రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచే పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు. తిరుమలలో స్వామివారికి ఏకాంత కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు.
భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5.15 గంటల నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడు సేవత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
VaikuntaUttara Dwara Darshanam,On Vaikunta Ekadashi,Devotees visit,Temples,Vaishnavalayas,Bhadrachalam,Yadagirigutta,Dharmapuri,Vaikuntha Ekadashi celebrations begin in AP and Telangana