ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం

2024-10-23 11:02:25.0

ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటెర్డ్ ఐఏఎస్‌ అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.

https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371801-anu.webp

ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. గతంలో తెలుగు దేశం పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా అనురాధ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీపీఎస్సీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఆ పనిని సమర్థంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టింది. ఈ మేరకు ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను నియమించింది.

ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా ఆమె పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని టీడీపీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ప్రభుత్వం మారినా.. గౌతమ్ సవాంగ్ పదవీ కాలం మరో ఏడాదిపాటు గడువు ఉంది. అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.