ఏపీలో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన ముదునూరి

2024-10-17 10:05:59.0

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు

https://www.teluguglobal.com/h-upload/2024/10/17/1369949-jagan.webp

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలోకి చేరారు. కాకినాడ జిల్లా అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, నాయకులు పాల్గొన్నారు.