ఏపీలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

2024-11-26 09:43:48.0

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381034-ec.webp

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ రిలీజ్ చేసింది. ఒడిశా, బెంగాల్‌, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్‌ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. డిసెంబర్‌ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉపసంహరణ , డిసెంబర్‌ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌, అదేరోజు లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మూడు నెలల అనంతరం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ, ఆర్‌ కృష్ణయ్య , బీద మస్తాన్‌రావు విడుదల వారీగా పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు.