2022-06-17 03:29:42.0
ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ భాషను రెండో అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి. తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఉర్దూకు రాష్ట్ర రెండవ అధికార భాషగా గుర్తింపు దక్కడంపై మంత్రి అంజాద్ బాషా స్పందించారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ భాషను రెండో అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి. తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఉర్దూకు రాష్ట్ర రెండవ అధికార భాషగా గుర్తింపు దక్కడంపై మంత్రి అంజాద్ బాషా స్పందించారు. ఉర్దూ ఓ మతానికి మాత్రమే సంబంధించిన భాష కాదని అన్నారు. తెలుగుతో సమానంగా ఉర్దూకు కూడా సమాన హోదా లభించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత అసెంబ్లీ సమావేశాలలోనే అధికార భాషల చట్ట సవరణ-2022 బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు రాష్ట్రంలో మైనార్టీల భద్రత, సామాజిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఏపీ మైనార్టీస్ కాంపొనెంట్, ఆర్ధిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం 2022ను కూడా అప్పుడు అసెంబ్లీ ఆమోదించింది.
AP Minorities Component,Assembly Sessions,Consumption Act 2022,Expenditure Allocation,Financial Resources,Minister Anjad Basha,second official language in AP,second official language in Telangana.,urdu