ఏపీలో 17 కిలోల అక్రమ బంగారం పట్టివేత

https://www.teluguglobal.com/h-upload/2025/01/12/1393855-gold.webp

2025-01-12 11:19:59.0

ఏపీలో భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంక్రాంతి పండుగ వేళ ఏపీలో భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ, తాడిపత్రి రైల్వే స్టేషన్‌, నెల్లూరు రైల్వే స్టేషన్‌, బొల్లపల్లి టోల్‌ ప్లాజా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 17.9 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాలో కస్టమ్స్‌ అధికారులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 17.9 కేజీలో బంగారాన్ని ఈ తనిఖీలలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులకు పట్టబడిన బంగారం విలువ మార్కెట్‌లో సుమారు రూ. 14.37 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఈ బంగారాన్ని నిందితులు అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ తరలింపులకు పాల్పడుతున్న 16 మంది నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటిపైన శనివారం విచారణ చేపట్టిన విశాఖలోని న్యాయస్థానం 14 రోజుల పాటు నిందితులకు రిమాండ్‌ విధించింది.

Sankranti festival,gold seized,Vijayawada,Tadipatri Railway Station,Nellore Railway Station,Customs officials,Kerala,Tamil Nadu,CM Chandrababu