ఏపీ అసెంబ్లీ జాయింట్‌ సెక్రటరీ పై వేటు

2024-11-09 13:44:37.0

చీఫ్ మార్షల్‌ క్లీన్‌ చీట్‌ ఇవ్వడంపై ఆగ్రహం

https://www.teluguglobal.com/h-upload/2024/11/09/1376364-ap-assembly.webp

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ జాయింట్‌ సెక్రటరీ విజయరాజుపై వేటు వేశారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఢిల్లీకి వెళ్లిన సమయంలో అప్పటి అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ దియో ఫిలస్‌ కు క్లీన్‌ చీట్‌ ఇస్తూ విజయరాజు డీజీపీ ఆఫీస్‌ కు లేఖ రాశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌ వైపునకు కెమెరాలు తిప్పిన వ్యవహారంలో చీఫ్‌ మార్షల్‌ పై చర్యలు తీసుకోవాలని అప్పటికే అసెంబ్లీ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నిర్దారించింది. ఈ విషయాన్ని తొక్కిపెట్టి దియో ఫిలస్‌ కు క్లీన్‌ చీట్‌ ఇవ్వడంపై అసెంబ్లీ సెక్రటరీ సీరియస్‌ అయ్యారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు నివేదించి ఆయన అనుమతితో జాయింట్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేశారు.