ఏపీ ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు

2024-11-14 11:22:51.0

Cancellation of AP MLC by-election

https://www.teluguglobal.com/h-upload/2024/11/14/1377761-rtyu.webp

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్‌ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం స్థానిన సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హత వేటు చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు ఈసీ వెల్లడించింది.